శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండల పరిధిలోని నర్కుడ కాళీమాత ఆలయం ఐదో వార్షికోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయనకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కాళీమాత మందిరంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేదాశ్వీరచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.