ఉచిత ట్రైనింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లెల చిన్నారెడ్డి

ఉచిత ట్రైనింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లెల చిన్నారెడ్డి

గోపాల్ పేట వెలుగు:  గోపాల్ పేట్ మండల కేంద్రంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ  అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను మండలంలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు  జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ఉచిత శిక్షణ తరగతులను అదివారం రామనంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్  ఎన్ కిశోర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు  జిల్లెల చిన్నారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా  ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి  మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ పేరిట 1995లో  సంస్థను  అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రారంభించారన్నారు.   

గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో స్వామి రామానంద తీర్థ సంస్థకు 18 నెలలు డైరెక్టర్ గా పనిచేశానని తెలిపారు. డైరెక్టర్ గా కోటి రూపాయలతో హైదరాబాద్ లో రామానంద తీర్థ సంస్థకు మంచి భవనం నిర్మించానని  అది నేడు హాస్టల్ గా వాడుకుంటున్నారని అన్నారు. నేటి యువత మత్తు పదార్థాలకు, అలవాటు కాకుండా  భవిష్యత్తు కోసం ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

కార్యక్రమంలో  రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కమ్మర్ మియా, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య , గోపాల్ పేట సింగల్ విండో అధ్యక్షుడు రఘు యాదవ్, గోపాల్ పేట జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ లాయర్ బాబా, కాంగ్రెస్ నాయకులు శివన్న,  కోదండం,  శ్రీనివాస్ రెడ్డి,  రాములు,  రమేశ్ , జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు జానకి రాముడు, వనపర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ,  పెద్దమందడి మండల పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్,  సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు,  సీనియర్ నాయకులు రాగి వేణు, పాండురంగారావు, మెట్టపల్లి రాములు, ఇర్షద్ పాల్గొన్నారు.