
కొడంగల్, వెలుగు: సంక్షేమానికి కేరాఫ్అడ్రస్గా సీఎం రేవంత్రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని స్టేట్ పోలీస్ హౌసింగ్కార్పొరేషన్చైర్మన్గురునాథ్రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్మండంలోని రావులపల్లి, కస్తూర్పల్లి, ఇందనూర్గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీని ఆయన ప్రారంభించారు.
దేశంలో పేదలకు సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ది జోడెద్దుల్లా పరుగులు తీస్తున్నాయన్నారు. సన్న బియ్యం పథకం సీఎం రేవంత్రెడ్డి పేదలకు అందిస్తున్న వరమని కొనియాడారు.