తండ్రీ కూతుళ్ల(MP & MLA) మధ్య ఆసక్తికర సంభాషణ

తండ్రీ కూతుళ్ల(MP & MLA) మధ్య ఆసక్తికర సంభాషణ

వారిద్దరు అధికార పార్టీ నేతలు.. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎంపీ.. ఈ విషయాన్ని పక్కన పెడితే తండ్రీ కూతుళ్లు కూడా.. తండ్రి కడియం శ్రీహరి స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. ఆయన కుమార్తె కావ్య  వరంగల్​ పార్లమెంట్​ సభ్యురాలు..  స్టేషన్​ ఘన్​పూర్​ లో ఏర్పాటు చేసిన ఓ సభలో వీరిద్దరి మధ్య ఆశక్తికర సన్నివేశం నెలకొంది.

వరంగల్​ ఎంపీ కడియం కావ్య ఆ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి శ్రీహరి రాజకీయంగా రిటైర్​ మెంట్​ ప్రకటిస్తానని పదేపదే అంటున్నారని... ఇలాంటి నిజాయితీ పరులు విశ్రాంతి తీసుకోవద్దని.. అయితే విధి రాత ఎలా ఉంటుందో చూడాలన్నారు కడియం కావ్య.  అదే వేదికపై ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె ప్రసంగాన్ని విచిత్రంగా చూస్తే.. ఆమె మాటలతో ఏకీభవించారు. కాని తనకు వయోభారం ఎక్కువైందన్నారు కడియం శ్రీహరి .. తండ్రీకూతుళ్ల (MP & MLA) సంభాషణ ను కార్యకర్తలు ఆశక్తిగా చూశారు.