వరల్డ్ కప్ నేడు (నవంబర్ 7) ఆస్ట్రేలియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో సంచలనాలు సృష్టిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను ఢీ కొట్టనుంది. ముంబై వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు తుది జట్టులో స్థానం లభించలేదు. ఎలాంటి గాయం కాకపోయినా స్మిత్ వర్టిగో సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ కు ముందు బిగ్ షాక్ తగిలింది.
ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్ కు తల తిరగడం, మైకంగా ఉండడంతో కాస్త అసౌకర్యంగా కనిపించాడు. నెట్స్ వెనుక అవుట్‌ఫీల్డ్‌లో పడుకుని, చివరికి జట్టు ఫిజియోథెరపిస్ట్‌తో కలిసి మైదానాన్ని విడిచిపెట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. గత ఒకటి, రెండు రోజులుగా నాకు కొద్దిగా తలతిరుగుతున్నట్లు అనిపిస్తోంది. అది కాస్త కలవరపెడుతోంది. నేను మంచిగా ఉండగలనని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ సమయానికి స్మిత్ కోలుకుంటాడని భావించినా అది సాధ్యపడలేదు. దీంతో స్మిత్ లేకుండానే ఆసీస్ ఈ కీలక మ్యాచ్ ఆడబోతుంది.
స్మిత్ ఈ ప్రపంచ కప్ లో పెద్దగా రాణించింది ఏమీ లేదు. కానీ కీలక మ్యాచ్ ల్లో చాలా ప్రమాదకర బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ స్టార్ ప్లేయర్ ను మిస్ అవ్వడం పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 గెలిచిన ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ల్లో గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ పై మ్యాచ్ గెలిచి సెమీస్ కు వెళ్తుందో.. లేకపోతే ఆఫ్గాన్.. ఆసీస్ కు షాక్ ఇస్తుందేమో చూడాలి.
ALSO READ : Cricket World Cup : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్గాన్.. సెమీస్ టార్గెట్ గా ఆసీస్
అసలేంటి ఈ వర్టిగో
వెర్టిగో అనేది అసమతుల్యత యొక్క భావన. మీకు ఇది ఉంటే మైకము, మీరు తిరుగుతున్నట్లు లేదా మీ చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్లు మీకు అనిపించవచ్చు. చాలా మంది ఎత్తుల భయాన్ని వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు, కానీ ఇది సరైనది కాదు. ఒక వ్యక్తి చాలా ఎత్తు నుండి క్రిందికి చూసినప్పుడు వెర్టిగో సంభవించవచ్చు, అయితే లోపలి చెవి లేదా మెదడులో సమస్యల కారణంగా సంభవించే తాత్కాలిక లేదా నిరంతర మైకము యొక్క ఎపిసోడ్‌లను సూచిస్తుంది.
Steve Smith is battling vertigo ahead of Australia's game against Afghanistan #CWC23 pic.twitter.com/GRiwJUfz9g
— Cricbuzz (@cricbuzz) November 6, 2023