విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేందుకే ఉద్దీపన : వేముల వీరేశం

విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేందుకే ఉద్దీపన : వేముల వీరేశం
  • ఎమ్మెల్యేలు వీరేశం, బీఎల్ఆర్ 

నకిరేకల్, వెలుగు : పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఉద్దీపన పాఠశాల లక్ష్యమని ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీఎల్ఆర్ అన్నారు. గురువారం నకిరేకల్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉద్దీపన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహాయ సహకారంతో ఉద్దీపన పాఠశాలను మరింత అభివృద్ధి చేసి పేద విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. 

అనంతరం విద్యార్థులు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్​చంద్ర పవార్, రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శంబయ్య, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాపిరెడ్డి, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజిత, మార్కెట్ కమిటీ చైర్మన్ మంజులామాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉమారాణి, ఉద్దీపన గౌరవ సలహాదారులు ఆనంద్,  హెచ్ఎం భద్రయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.