వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

  • మరో ఐదుగురిని కరిచిన కుక్కలు
  • శంషాబాద్ పరిధి మధురానగర్​లో ఘటన

శంషాబాద్, వెలుగు: గ్రేటర్​లో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. శంషాబాద్ పరిధి మధురానగర్ కాలనీ రోడ్ నం. 9లో శనివారం ఒక్కరోజే ఆరుగురిపై కుక్కలు దాడులు చేశాయి. మధ్యాహ్నం అక్షర(4) అనే బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఓ వీధి కుక్క దాడి చేసింది. చిన్నారి మొహాన్ని గాయపర్చింది. వెంటనే స్థానికులు గాయపడ్డ బాలికను ప్రైవేటు ​హాస్పిటల్​కు తీసుకెళ్లారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నారాయణగూడలోని ఐపీఎం హాస్పిటల్​కు తరలించారు. అదే ఏరియాలోని మరో ఐదుగురిపైనా కుక్కలు దాడులు చేయగా.. వారు ప్రైవేటు హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మధురా నగర్ కాలనీలో వందలాది వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.