చదువుకోవడం ఇష్టం లేక స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

చదువుకోవడం ఇష్టం లేక స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌

ధర్మసాగర్ (వేలేరు), వెలుగు : చదువుకోవడం ఇష్టం లేక ఓ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని పీచరకు చెందిన కంకణాల యాదకుమార్‌‌‌‌ కోమల దంపతులు తమ చిన్న కొడుకు సూర్యకుమార్ (18) టెన్త్‌‌‌‌ పూర్తి కాగానే హనుమకొండలోని ఓకాలేజీలో చేర్పించారు. అక్కడ చదువుకోవడం ఇష్టం లేక ఇంటికి తిరిగి వచ్చాడు. తర్వాత స్టేషన్‌‌‌‌ఘన్‌‌‌‌పూర్‌‌‌‌, వేలేరు మండల కేంద్రంలోని గురుకులంలో చేర్పించినప్పటికీ అక్కడ కూడా ఉండలేక ఇంటికి వచ్చేశాడు. 

చివరకు ఐటీఐ చేస్తానని చెప్పడంతో రాంపూర్‌‌‌‌లోని ఓ కాలేజీలో చేర్పించారు. అక్కడ కూడా ఉండలేక ఇటీవల ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన సూర్యకుమార్‌‌‌‌ మంగళవారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగాడు. తర్వాత తల్లికి ఫోన్‌‌‌‌ చేసి చెప్పాడు. తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి చూడగా కిందపడిపోయి కనిపించాడు. వెంటనే 108కు కాల్‌‌‌‌ చేసి ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ సాయంత్రం చనిపోయాడు. సూర్యకుమార్‌‌‌‌ తండ్రి యాదకుమార్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై సురేశ్‌‌‌‌ తెలిపారు.