మౌంట్ పతల్స్ పర్వతంపై తెలంగాణ విద్యార్థి

మౌంట్ పతల్స్ పర్వతంపై  తెలంగాణ విద్యార్థి
  • హిమాచల్ లోని శిఖరం ఎక్కి ఘనత సాధించిన ‘ఖని’ వాసీ 

గోదావరిఖని, వెలుగు: తెలంగాణకు చెందిన  విద్యార్థి హిమాచల్​ ప్రదేశ్  కులు మనాలిలోని 4, 470 మీటర్ల ఎత్తైన ‘మౌంట్​ పతల్స్’ పర్వతాన్ని ఎక్కి భేష్ అనిపించాడు. మంచిర్యాల జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన రావడి సాయి సంప్రిత్​ కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్​ లోని శ్రీచైతన్య ఢిపెన్స్​అకాడమీలో ఇంటర్​ఫస్ట్ ​ఇయర్ ​చదువుతున్నాడు.గిన్నిస్ రికార్డు గ్రహీత  మహిపాల్​రెడ్డి, కోచ్​ శివరామకృష్ణ శిక్షణలో భాగంగా అకాడమీ తరఫున సోమవారం పల్స్ పర్వతం ఎక్కి రికార్డు సాధించాడు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఎస్​ ఫర్​ లైఫ్..సే నో టు డ్రగ్స్​’ నినాదంతో యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించే లక్ష్యంతో పర్వతాన్ని ఎక్కినట్టు సాయిసంప్రిత్​ తెలిపారు. పర్వతారోహణకు దాదాపు 12 గంటల సమయం పట్టిందని చెప్పాడు. విద్యార్థి తల్లిదండ్రులు, కోచ్ ఆనందం వ్యక్తం చేశారు.