
భద్రాచలం, వెలుగు : భద్రాచలం పట్టణంలో శనివారం 76వ గణతంత్ర దినోత్సవంసందర్భంగా 250 మీటర్ల తిరంగా జెండాతో నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టూడెంట్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. జాతీయ జెండా విశిష్టత, దేశభక్తిని చాటుతూ, మహనీయుల త్యాగాలను స్మరిస్తూ ‘భారత్‌మాతాకీ జై.. జై జవాన్.. జై కిసాన్..’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై మధుప్రసాద్, మదర్‌థెరిస్సా ట్రస్టు అధ్యక్షుడు మురళీ, హెచ్ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.