భద్రాచలం, వెలుగు: దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో పనిచేసే టీచర్లు స్టూడెంట్లను తమ ఇండ్లకు తీసుకెళ్లి పనులు చేయించుకుంటున్నారని పీడీఎస్‌యూ డివిజన్కార్యదర్శి ఎం. శివప్రశాంత్ఆరోపించారు. స్టూడెంట్లు టీచర్ల ఇండ్లలో పనిచేస్తున్న ఫొటోలను గురువారం మీడియాకు రిలీజ్ చేశారు. ఇటీవల గౌరారం ఆశ్రమ స్కూల్లో ఈ తరహా ఘటన జరిగిందని చెప్పారు.
గురుకుల, ఆశ్రమ స్కూళ్లలోకి స్టూడెంట్ లీడర్లను అనుమతించొద్దంటున్న అధికారులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చదువు చెప్పాల్సిన టీచర్లు.. స్టూడెంట్లను క్యాంపస్‌లోని తమ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి వెట్టి చాకిరి చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.