చాయ్ బిస్కెట్ ఫేమ్ డైరెక్టర్ సందీప్ దర్శకత్వంలో వచ్చిన కలర్ ఫోటో సినిమాతో క్లాసికల్ హిట్ అందుకున్న సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ టైమ్ హీరోగా బిజీ అయిపోయాడు. ఈ క్రమంలో డిఫరెంట్ జోనర్ లో స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ ఆడియన్స్ ని బాగానే అలరిస్తున్నాడు. సుహాస్ ప్రస్తుతం "ఓ భామ అయ్యే రామ" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి నూతన డైరెక్టర్ రామ్ గోధాల దర్శకత్వం వహిస్తున్నాడు. సుహాస్ కి జంటగా జో మూవీ ఫేమ్ యంగ్ హీరోయిన్ మాళవిక మనోజ్ నటిస్తోంది.
క్రిస్మస్ సందర్భంగా "ఓ భామ అయ్యే రామ" గ్లింప్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మాళవిక సుహాస్ తో దేవుడినైనా, రాముడినైనా నడిపించేది ఆడదేనని చెబుతుంది. దీంతో సుహాస్ ఏకంగా అందుకే కదా మీరు మా ప్రాన్లు తీసేది అని చెప్పగానే మాళవిక సీరియస్ లుక్ ఇస్తుంది. వెంటనే సుహాస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ అందుకే కదా మేం మీకు ప్రాణాలు ఇచ్చేది అంటూ మాట మారుస్తూ కవర్ చేస్తాడు.
ఆ తర్వాత కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్లగానే ఆగిపోతుంది. దీంతో మాళవిక సుహాస్ ని దిగి తొయ్ అంటూ చెప్తుంది. దీంతో సుహాస్ విసుక్కుంటూ కారు తోస్తాడు. ఆ తర్వాత టైటిల్ కార్డు తో గ్లింప్స్ ఎండ్ అవుతుంది. మొత్తానికి హీరో సుహాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించేందుకు మళ్ళీ సరికొత్త కాన్సెప్ట్ తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా సుహాస్ హీరోగా నటించిన "జనక అయితే గనక" అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. కానీ కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు.