దసరా ఫెస్టివల్ స్పెషల్.. ఓటీటీలోకి సుహాస్ మూవీ.. కథేంటంటే?

దసరా ఫెస్టివల్ స్పెషల్.. ఓటీటీలోకి సుహాస్ మూవీ.. కథేంటంటే?

డిఫరెంట్ కాన్సెప్ట్‌ సినిమాలతో నటుడిగానే కాక హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు సుహాస్ (Suhas). తను సినిమాలో ఉన్నాడంటే కచ్చితంగా అది కంటెంట్‌ బలంగా ఉన్న సినిమానే అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ‘గొర్రె పురాణం’ (Gorre Puranam)అనే చిత్రంతో అక్టోబర్ 21న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుహాస్.

బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టైటిల్, టీజర్‌‌తో ఆసక్తిరేపిన థియేటర్లలోకి వచ్చాక గొర్రె పురాణం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్, కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా ఓటీటీ అడుగుపెట్టడానికి సిద్దమైంది. గురువారం అక్టోబర్ 10న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి రాబోతుంది.

" పురాణాలందు ఈ 'గొర్రె పురాణం' వేరయా!అక్టోబరు 10 న ఆహాలో వస్తుందయా" అని మేకర్స్ ప్రకటించారు. కాగా థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుండటంతో దసరా ఫెస్టివల్ గా  ఓటీటీ ఆడియన్స్ ను ఎలా అలరిస్తుందో చూడాలి. 

Also Read :- సినిమా షూటింగ్లో స్టార్ హీరో మెడకు గాయం

కథేంటంటే:

రవి (సుహాస్‌) ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. మరోవైపు రామ్ అలియాస్ యేసు అనే గొర్రె తన యజమాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. కసాయి వాడినే గొర్రె నమ్ముతుందనే సామెతను నిజం చేస్తూ.. ఓ దళారి దగ్గరకు చేరుతుంది.  దాన్ని కొనుగోలు చేసిన ఓ ముస్లిం వ్యక్తి  తమ మత సంప్రదాయాల ప్రకారం జుబా చేసే సమయానికి, అతని కూతురు ఆ గొర్రెపై ప్రేమతో తప్పిస్తుంది. అలా తప్పించుకున్న గొర్రె ఓ గ్రామదేవత ఆలయంలో దూరి..  కల్లు తాగి జట్కా ఇస్తుంది. ఆ దేవతే దాన్ని పంపిందని భావించిన భక్తులు.. బలి ఇవ్వాలనుకుంటారు. అక్కడి నుంచి కూడా తప్పించుకుటుంది. దీంతో రెండు మతాల వాళ్లు దాని వెంట పడతారు. గొర్రె ఎవరికి దక్కాలి అనే విషయంపై పంచాయితీ జరుగుతుంది.  

ఇది కాస్తా సోషల్ మీడియాకు, అటు నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వెళ్తుంది. మత కలహాలకు కారణమైందని, మనో భావాలు దెబ్బతీస్తోందని ఆ గొర్రెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టు ఆ గొర్రెను రిమాండ్‌కు పంపుతుంది. హత్య కేసులో జైలులో ఉన్న రవి సెల్‌లోనే గొర్రెను కూడా బంధిస్తారు. రవి  ఎందుకు ఆ హత్య చేశాడు, అతని గతం ఏమిటి.. జైలులో ఉన్న గొర్రెను చంపడానికి ప్రయత్నించింది ఎవరు.. గొర్రెను తప్పించాలనుకున్న రవి ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.