ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో నగాల్‌‌‌‌‌‌‌‌

ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో నగాల్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ సుమిత్ నగాల్‌‌‌‌‌‌‌‌.. రొసారియో చాలెంజర్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. అర్జెంటీనాలో మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిదో సీడ్‌‌‌‌‌‌‌‌ నగాల్‌‌‌‌‌‌‌‌ 5–7, 6–1, 6–0తో రెంజో ఒలివో (అర్జెంటీనా)పై గెలిచాడు. ఆరంభంలో తడబడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ తొలి సెట్‌‌‌‌‌‌‌‌ చేజార్చుకున్నాడు. 

క్లే కోర్టుపై ఒలివో కొట్టిన గ్రౌండ్ షాట్స్‌‌‌‌‌‌‌‌ను తీయలేకపోయాడు. కానీ రెండో సెట్‌‌‌‌‌‌‌‌ నుంచి నగాల్‌‌‌‌‌‌‌‌ బలంగా పుంజుకున్నాడు. బలమైన సర్వీస్‌‌‌‌‌‌‌‌లతో కచ్చితమైన గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌తో విరుచుకుపడ్డాడు. ఫోర్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌, బ్యాక్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌‌‌‌‌ షాట్లలోనూ తన మార్క్‌‌‌‌‌‌‌‌ ఆటను చూపెట్టి సెట్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. ఇక డిసైడర్‌‌‌‌‌‌‌‌లో నగాల్‌‌‌‌‌‌‌‌ ధాటికి ఒలివో ఎదురు నిలవలేకపోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌‌‌‌‌‌‌‌లను మూడుసార్లు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసి ఈజీగా సెట్‌‌‌‌‌‌‌‌ను, మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకున్నాడు.