SRH vs MI: ఉప్పల్‌లో ఘోరంగా సన్ రైజర్స్ బ్యాటింగ్.. 35 పరుగులకే సగం జట్టు ఔట్

SRH vs MI: ఉప్పల్‌లో ఘోరంగా సన్ రైజర్స్ బ్యాటింగ్.. 35 పరుగులకే సగం జట్టు ఔట్

ఉప్పల్ వేదికగా బుధవారం (ఏప్రిల్ 23) ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లో దారుణంగా ఆడుతుంది. సొంతగడ్డపై పరుగుల వరద పారించే మన ఆటగాళ్లు.. వరుసపెట్టి పెవిలియన్ కు చేరుతున్నారు. తొలి 10 ఓవర్లలోనే ఘోరమైన స్థితిలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేస్తున్న హైదరాబాద్ 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు రెండో ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది.

ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) ను బోల్ట్ పెవిలియన్ కు చేర్చాడు. మూడో ఓవర్ తొలి బంతికే ఇషాన్ కిషాన్ (8) ఔట్ కాకపోయినా తనకు తానుగా ఔట్ అని వెళ్ళిపోయాడు. నాలుగో ఓవర్లో బోల్ట్ మరో షాక్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ (8) ను ఔట్ చేయడంతో సన్ రైజర్స్ మూడో వికెట్ కోల్పోయింది. నితీష్ రెడ్డి(2), అనికేత్ వర్మ (12) కూడా ఎక్కవ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. దీంతో 35 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరింది. ముంబై బౌలర్లలో బోల్ట్, చాహల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యకు ఒక వికెట్ దక్కింది.