రెండు రోజుల పోలీసు కస్టడీకి ‘లగచర్ల’ ఏ2 నిందితుడు

 రెండు రోజుల పోలీసు కస్టడీకి ‘లగచర్ల’ ఏ2 నిందితుడు

కొడంగల్, వెలుగు: లగచర్ల ఘటనలో ఏ2 నిందితుడు సురేశ్​రాజ్ ను రెండు రోజుల పోలీసుల కస్టడీకి కొడంగల్ కోర్టు అనుమతించింది. గత నెల 11న ప్రజాభిప్రాయ సేకరణకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి వెళ్లిన అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఏ1 పట్నం నరేందర్ రెడ్డి, ఏ2 సురేశ్​రాజ్ కస్టడీకి పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి తీర్పుని రిజర్వ్ చేశారు. 

సోమవారం ఏ2 నిందితుడు సురేశ్​ రాజ్ ను  పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అనుమతి ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ ఈనెల 6కు మెజిస్ట్రేట్ వాయిదా వేశారు . అలాగే మరో నలుగురు నిందితులు మెజిస్ట్రేట్ ముందు సరెండర్ అయ్యారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించగా పరిగి జైలుకు తరలించారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు 34 మంది నిందితులు రిమాండ్ లో ఉన్నారు.