T20 World Cup 2024: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్న సూర్య

T20 World Cup 2024: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్న సూర్య

 వెస్టిండీస్,అమెరికా వేదికలుగా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. లీగ్ మ్యాచ్ లు ముగించుకొని బుధవారం (జూన్ 19) నుంచి సూపర్ 8 మ్యాచ్ లు మొదలు కానున్నాయి. సూపర్ 8 మ్యాచ్ లకు ముందు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టీమిండియా టీ20 చిచ్చర పిడుగు సూర్య కుమార్ యాదవ్ తన టాప్ ర్యాంక్ ను పదిలం చేసుకున్నాడు. 837 రేటింగ్ పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 771 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ ఓపెనర్ పిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజం,మహ్మద్ రిజ్వాన్,ట్రావిస్ హెడ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 

భారత క్రికెటర్లలో యశస్వి జైస్వాల్ 7 స్థానంలో నిలిచి టాప్ 10 లో చోటు సంపాదించాడు. బౌలింగ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.  వెస్టిండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్లలో ఆసీస్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మహమ్మద్ నబీ రెండో స్థానములో కొనసాగుతుండగా.. భారత ఆటగాడు హార్దిక్ పాండ్య 7 వ స్థానంలో చోటు సంపాదించాడు.
 
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: 

1) సూర్యకుమార్ యాదవ్ (837)
2) ఫిల్ సాల్ట్ (771)
3) బాబర్ ఆజం (755)                     
4) మహ్మద్ రిజ్వాన్ (746)
5)ట్రావిస్ హెడ్ (742)        
6)జోస్ బట్లర్    (710)    
7)యశస్వి జైస్వాల్ (693)
8)ఐడెన్ మార్క్రామ్    (674)
9)బ్రాండన్ కింగ్ (668)
10)రీజా హెండ్రిక్స్ (661)