టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు అంచనాలకు తగ్గట్టుగానే గ్రూప్ టాపర్ గా నిలిచి సూపర్ 8 కు చేరుకుంది. ఇప్పటి నుంచి అసలు సమరం ప్రారంభం కానుంది. సూపర్ 8లో భాగంగా మూడు కీలక మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. సెమీ ఫైనల్స్ కు వెళ్లాలంటే కనీసం రెండు మ్యాచ్ లు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ మూడు మ్యాచ్ లు వెస్టిండీస్ లోనే జరగనున్నాయి. ఇప్పటికే భారత్ వెస్టిండీస్ చేరుకున్న అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సమయంలో భారత కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కు గాయమైనట్టు తెలుస్తుంది.
భారత్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా త్రో డౌన్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ కు కుడి చేతి వేలికి గాయమైంది. అయితే మ్యాజిక్ స్ప్రే వేసిన కొద్ది సేపటి తర్వాత అతను మళ్లీ నెట్స్‌లోకి వచ్చాడు. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి అతని కుడి చేతికి ఐస్ ప్యాక్ వేసుకుంటూ కనిపించాడు. అయితే సూర్య గాయం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అతను ఫిట్ గా ఉన్నాడని ఆడతాడని నివేదికలు చెబుతున్నాయి. ఇది కేవలం చిన్న గాయమేనని.. సూర్య జూన్ 20 న ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తుంది.
టీమిండియా సూపర్ 8 షెడ్యూల్:
జూన్ 20: ఆఫ్ఘనిస్తాన్ v ఇండియా, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
జూన్ 22: భారత్ v బంగ్లాదేశ్, నార్త్ సౌండ్, ఆంటిగ్వా
జూన్ 24: ఆస్ట్రేలియా v ఇండియా, గ్రాస్ ఐలెట్, సెయింట్ లూసియా