
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 24న సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజున జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. అలాగే, మెడికల్ కాలేజీ భవనాన్ని, సమీకృత మార్కెట్‌ను ఓపెన్ చేయనున్నారు. తర్వాత జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.