పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలి : సన్ ప్రీత్ సింగ్

పోలీసులు టెక్నాలజీని వాడుకోవాలి :  సన్ ప్రీత్ సింగ్
  • ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

మోతె(మునగాల), సూర్యాపేట, వెలుగు  : టెక్నాలజీని పోలీసులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. సోమవారం మోతె పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. లక్ష్యంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చునన్నారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా సామాజిక రుగ్మతలు, అసాంఘిక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు, బెట్టింగ్, జూదం లాంటివి లేకుండా చూడాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట కోదాడ సబ్ డివిజనల్ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​వీరరాఘవులు, మునగాల సర్కిల్ ఇన్​స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ యాదవ్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు. అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట పట్టణంలో ఎన్టీఆర్ పార్కు నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు 2కే రన్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డితో కలిసి ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 2కే రన్​ను జెండా ఊపి ప్రారంభించారు.