మెదక్ టౌన్, వెలుగు : అనుమానాస్పదస్థితిలో మున్సిపల్ జవాన్ చనిపోయిన ఘటన మెదక్‌లో జిల్లాలో జరిగింది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. మెదక్‌టౌన్ పిట్లంబేస్వీధికి చెందిన మల్లారెడ్డిపేట సంజీవులు(41)స్థానిక మున్సిపాలిటీలో జవాన్. మంగళవారం రాత్రి అతడు ఇంట్లో మద్యం తాగిన అనంతరం భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్‌చేసినా లిఫ్ట్‌చేయలేదు.
బుధవారం ఉదయం మెదక్‌టౌన్ రైల్వేస్టేషన్సమీపంలోని మున్సిపల్ డంప్‌యార్డులో సంజీవులు ఉరేసుకుని చనిపోయాడు. అక్కడికి వచ్చిన తోటి సిబ్బంది చూసి వెంటనే పోలీసులకు, మున్సిపల్అధికారులకు సమాచారం ఇచ్చారు. డంప్‌యార్డుకు వెళ్లి డెడ్ బాడీని దించి పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. భార్య సావిత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. జవాన్ మృతి చెందడంతో మున్సిపల్ అధికారులు, తోటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.