న్యూఢిల్లీ: బోల్ట్ పేరుతో ఆఫర్ చేస్తున్న ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ’ సర్వీస్‌లను 400 సిటీలకు స్విగ్గీ విస్తరించింది. మొదట బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, పూణె వంటి మెట్రోల్లో మొదలైన బోల్ట్ సర్వీస్‌లు, తాజాగా జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, కోయంబత్తూర్, కొచ్చి వంటి సిటీల్లో అందుబాటులోకి వచ్చాయి.
రూర్కీ, గుంటూరు, వరంగల్, పాట్నా, జగిత్యాల, సోలన్, నాసిక్, షిల్లాంగ్ వంటి టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా బోల్ట్ సర్వీస్‌లు మొదలు పెట్టామని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ’ సర్వీస్‌లకు ఆదరణ బాగుందని తెలిపింది. ఆహారం తయారీ సమయం తక్కువగా ఉండేలా చూడడానికి రెస్టారెంట్లతో చర్చలు జరుపుతున్నామని వివరించింది. రెస్టారెంట్ నుంచి రెండు కిలోమీటర్లలోపు మాత్రమే బోల్ట్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి.