న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ)ను ప్రారంభించేందుకు సెబీ అనుమతి ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రీ-ఫైలింగ్ (కాన్ఫిడెన్షియల్) మార్గంలో కంపెనీ ఏప్రిల్ 30న సెబీకి తన ఆఫర్ డాక్యుమెంటును దాఖలు చేసింది. ఫలితంగా, ఐపీఓ వివరాలు అధికారికంగా బయటికి రాలేదు. కంపెనీ ఐపీఓని రూ. 11 వేల కోట్లకు పెంచిందని, ఇందులో తాజాగా రూ. 5,000 కోట్ల నిధుల సమీకరణ కూడా ఉందని మార్కెట్‌వర్గాలు తెలిపాయి.
స్విగ్గీ తన ఐపీఓని ప్రారంభించే ముందు, అప్డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను కనీసం 21 రోజుల పాటు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. ఈకాలంలో ఆఫర్ డాక్యుమెంట్‌పై ఏదైనా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రజలకు అనుమతి ఉంటుంది. ఈ వ్యవధి ముగిసిన తర్వాత, కంపెనీ తన ఐపీఓని కొనసాగించవచ్చు.