యూత్ కాంగ్రెస్కు పీసీసీ చీఫ్ వార్నింగ్.. పార్టీ ఆఫీస్లపై దాడులు కరెక్ట్ కాదు: మహేశ్ కుమార్ గౌడ్

యూత్ కాంగ్రెస్కు పీసీసీ చీఫ్ వార్నింగ్.. పార్టీ ఆఫీస్లపై దాడులు కరెక్ట్ కాదు: మహేశ్ కుమార్ గౌడ్

యూత్ కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పార్టీల ఆఫీసులపై దాడులు మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపాలని సూచించారు. బీజేపీ నేతలు కూడా గాంధీ భవన్ పై  దాడులు సరికాదన్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిందే కానీ..దాడులు చేయొద్దన్నారు .శాంతిభద్రతల పరిరక్షణకు బీజేపీ నేతలు సహకరించాలన్నారు.

ALSO READ | గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. నాంపల్లిలో భారీగా పోలీసుల మోహరింపు

జనవరి 7న ఉదయం యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నించింది. కాంగ్రెస్ నేతలను బీజేపీ లీడర్స్ అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు  చేసుకుంది. పోటా పోటీగా నిరసనలు చేసుకోవడంతో పాటు కర్రలతో ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు.  అయితే  బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి నిరసనగా బీజేపీ యువ మోర్చా నాయకులు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.  

ALSO READ | నాంపల్లి సెంటర్లో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు : అసలు కారణం ఇదీ..!

కాంగ్రెస్ నేతలను బీజేపీ ఆఫీస్ దగ్గరకు అనుమతించి.. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ లీడర్స్. బీజేపీ నేతలకు పోటీగా అటు కాం గ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటా పోటీ నిరసనలతో నాంపల్లిలో హై టెన్షన్ నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు.