- కట్టడాన్ని పేల్చేస్తామంటూ దుండగుల ఈమెయిల్
ఆగ్రా (యూపీ): ప్రపంచ ప్రిసిద్ధ కట్టడమైన తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు వచ్చింది. తాజ్ మహల్ ను పేల్చేస్తామంటూ యూపీ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి గుర్తు తెలియని ఆగంతకులు మంగళవారం ఈ మెయిల్ పంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్, డాగ్‌స్కాడ్, ఇతర బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని ఏసీపీ సయీద్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు. కట్టడం వద్ద భద్రతను మరింత పెంచినట్టు పేర్కొన్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.