హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైందన్న టాక్ గత మూడు రోజులుగా సిటీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై శనివారం (జవనరి 25) జరగనున్న పార్టీ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
గురువారం (జనవరి 23) GHMC కమిషనర్‌తో గ్రేటర్ హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో కమిషనర్ ఇలాంబర్తి న కలిసిన బీఆర్ఎష్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హైదరాబాద్‌లోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై వినతిపత్రం సమర్పించారు.
ALSO READ | హైదరాబాద్‌కు రెండు భారీ డేటా సెంటర్లు: రూ.10 వేల కోట్లకు దావోస్‌లో డీల్
అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని.. వాటిని పరిష్కారించాలంటూ కమీషనర్ కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. స్ట్రీట్ లైట్స్ ఎక్కడ వెలగట్లేదు, రోడ్లు సరిగ్గా లేవు, ఫ్లై ఓవర్స్ నిర్మాణాలు ఆగిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది ఏ పనులు చేయకపోయినా సైలెంట్‌గా ఉన్నాం.. ఇక నుంచి నిలదీస్తామన్నారు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డుల అప్లికేషన్లు వచ్చాయని.. అప్లై చేసుకున్నా వారందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు సంబంధించి అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని.. స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పకుండానే శంకుస్థాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కనీసం మా ఫోన్లు ఎత్తడం లేదని.. మా నెంబర్లు కూడా బ్లాక్ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కొత్త ప్రభుత్వం సెట్ అయ్యే వరకు టైమ్ పడుతుందని ఇన్ని రోజులు మేం ఎలాంటి ఆందోళన చేయలేదని.. ఇకపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో మా పార్టీ సభ్యులే మెజారిటీ ఉన్నారని.. అయినా మా సభ్యుల ప్రశ్నలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు