
చెన్నై: సాధారణ వ్యక్తిలా తిరుగుతూ.. సామాన్యుల కష్ట సుఖాలను నేరుగా అడిగి తెలుసుకుంటూ.. వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ దేశంలోనే ప్రత్యేకత చాటుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయంపూట ఉచితంగా టిఫిన్ అందిస్తామని ప్రకటించారు. ఉదయంపూట అల్పాహారంతోపాటు పౌష్టికాహారం అందిచడంతోపాటు.. వైద్య పరీక్షలు, చికిత్స అందించే సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపే అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి ఎస్ఎస్ శివశంకర్ ఇటీవలే ప్రకటించగా.. ఇవాళ స్టాలిన్ ఉచితంగా టిఫిన్, వైద్య చికిత్సలను అందించే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకులు సీఎన్ అన్నాదురైలకు నివాళులర్పించారు. మెరీనా బీచ్ కు చేరుకునేందుకు సాధారణ ప్రయాణికుడిలా సిటీ బస్సులో ప్రయాణించారు. తన పాలన, బస్సు సౌకర్యాల వంటి అంశాలను ప్రయాణికులు, కండక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూాడా చదవండి
జాబ్స్ పేరుతో అమ్మాయిలకు బ్లాక్ మెయిల్..షీ టీమ్స్కి వెల్లువలా ఫిర్యాదులు
సంపద అంతా కేసీఆర్ కుటుంబమే దోచుకుంది..!