ఢిల్లీలో తమిళనాడు సీఎం స్టాలిన్ పర్యటన

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇవాళ ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్  సిసోడియాతో  సమావేశమయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిన్న గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి శ్రీలంక తమిళులకు మానవతా సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.

తమ పొరుగునే ఉన్న శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలా మంది లంక నుండి పారిపోయి సముద్ర మార్గం గుండా రాష్ట్రానికి వస్తున్నారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన 14 పాయింట్ల డిమాండ్ల చార్టర్‌ను  ప్రధాని మోదీకి అందజేశారు.  అలాగే హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలను కూడా కలిశారు. ఇవాళ రెండో రోజు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింత్ కేజ్రివాల్, ఆయన డిప్యూటీ సీఎం తదితరులతో స్టాలిన్ సమావేశమయ్యారు.  ఆ తర్వాత  రాజకీయ సర్వోదయ  కన్యా విద్యాలయాన్ని  సందర్శించారు. విద్యాలయంలో  విద్యార్థులు ప్రదర్శనకు ఉంచిన ప్రాజెక్టులను పరిశీలించారు.వారితో మాట్లాడి  వివరాలు అడిగి  తెలుసుకున్నారు.  

 

ఇవి కూడా చదవండి

మోడీని చంపేస్తాం.. ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్..

అర్హతలేని మనిషి మంత్రి హోదాలో కొనసాగుతున్నడు

మీపై చైనా దాడి చేస్తే.. రష్యా ఆదుకుంటదా?

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె