- పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్
సికింద్రాబాద్, వెలుగు : తార్నాక చౌరస్తాలో జరుగుతున్న జంక్షన్పున:ప్రారంభ అభివృద్ధి పనులను గ్రేటర్డిప్యూటీ మేయర్మోతె శ్రీలతారెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తార్నాక జంక్షన్‌ను ఎనిమిదేండ్ల కింద మూసేసి రైల్వే డిగ్రీ కాలేజీ , ఐఐసీటీ వద్ద యూ-టర్న్ పెట్టారని, దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వచ్చే జనవరి నాటికి జంక్షన్‌వద్ద వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు.