ఇక భవిష్యత్​ అంతా ఏఐదే : శ్రీకాంత్​ సిన్హా

ఇక భవిష్యత్​ అంతా ఏఐదే : శ్రీకాంత్​ సిన్హా
  • టాస్క్​ సీఈవో శ్రీకాంత్​ సిన్హా 

నిజామాబాద్, వెలుగు : భవిస్యత్​ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​దేనని, ప్రతిభ గలవారు ఉత్యుత్తమ స్థానంలో ఉంటారని తెలంగాణ అకాడమీ ఆఫ్​ స్కిల్స్ అండ్ నాలెడ్జి (టాస్క్​) సీఈవో శ్రీకాంత్​ సిన్హా అన్నారు. శుక్రవారం నగరంలోని ఐటీ హబ్​లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ ఓపెనింగ్​ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికా దేశం శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే స్కౌట్ బెటర్ సంస్థ తెలంగాణలోని నిజామాబాద్​లో తన రెండో బ్రాంచ్​ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

దీంతో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యూత్​కు ఏఐపై ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు ఈ సంస్థ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందన్నారు. అనంతరం ఐటీ హబ్​లో ఉద్యోగాలు సాధించిన 30 మందికి అపాయింట్​మెంట్​ లెటర్లు అందించి అభినందించారు. కార్యక్రమంలో స్కౌట్​బెటర్ సంస్థ ప్రతినిధులు రక్షిత్, రాఘవ్, టాస్క్​డెలిగేట్స్ శ్రీనాథ్​రెడ్డి, రఘుతేజ, హన్మంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.