ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న టాటా మోటార్స్ Punch EV మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV కారు కోసం బుకింగ్ లు జనవరి మొదటి వారంలోనే ప్రారంభం అయ్యాయి. రూ. 21 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. అయితే కొనేముందు TATA Punch EV గురించి 5 నిజాలను తెలుసుకుందాం.
TATA Punch EV రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తోంది.
- 25kWh బ్యాటరీ- ఇది ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
- 35kWh బ్యాటరీ- ఇది ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 421 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
TATA Punch EV SUV ఐదు వేరియంట్లలో లభిస్తోంది. కస్టమర్లు వారికి నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.
అద్భుతమైన డిజైన్ :
- TATA Punch EV ఇది Nexon EV ని పోలి ఉంటుంది.
- ఫ్రంట్ ట్రంక్(ఫ్రాంక్), LED లైట్ బార్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్
- కొత్త అల్లాయ్ వీల్ డిజైన్
- ఇది Acti.EV అనే కొత్త జనరేషన్ 2 ఆర్కిటెక్చర్ నిర్మాణం కలిగిన మొదటి టాటా ఎలక్ట్రిక్ కారు
- Curvv EV, Sierra EV, హారియర్ EV వంటి రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సపోర్ట్ చేస్తుంది.
ఇంజన్, ఛార్జింగ్ ఎంపికలు
- 122bhp , 190Nm ఉత్పత్తి చేయగల మోటార్ లాంగ్ రేంజ్ వేరియంట్
- 82 bhp, 114Nm మోటార్ సాధార్ వేరియంట్
- 9.5 సెకన్లలో 100kph వేగాన్ని అందుకోగల సామర్థ్యం తో TATA Punch EV పవర్ ట్రెయిన్ వేరియంట్లు ఉన్నాయి.
ఛార్జింగ్ ఎంపికలు
- 3.3kWవాల్ బాక్స్ ఛార్జర్, 7.2kW ఫాస్ట్ ఛార్జర్
- DC ఫాస్ట్ ఛర్జింగ్ కు మద్దతు నిస్తుంది
- కేవలం 56 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్ అవుతుంది
ప్రీమియం ఇంటీరియర్ , కట్టింగ్ ఎడ్జ్ ఫీచర్లు :
- కొత్త డ్యాష్ బోర్డ్ డిజైన్
- 10.25 అంగుళాల స్క్రీన్ తో ఇన్ఫోటైన్ మెంట్
- రీజెన్ కంట్రోల్ కసం స్టీరింగ్ వీల్ ప్యాడిల్స్ తో పాటు ఇన్ స్ట్రుమెంట్ డిస్ ప్లే వంటి ఫీచర్లు
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు,
- 360 డిగ్రీ కెమెరా
- బ్లైండ్ స్పాట్ మానిటర్
- వైర్ లెస్ ఫోన్ ఛార్జర్
- సన్ రూఫ్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్
సెక్యూరిటీ ఆప్షన్లు
టాటా మోటార్స్ ఈ క్రింది సెక్యూరిటీ ఆప్షన్లతో ప్రయాణికులకు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
- ఆరు ఎయిర్ బ్యాగులు,
- ABS, ESC అన్ని సీట్లకు మూడు పాయింట్ సీట్ బెల్ట్ లు
- ISOFIX మౌంట్లు