- స్టిచ్చింగ్కు మహిళా సంఘాలకు అప్పగింత
- ధరించలేని విధంగా స్కూల్యూనిఫామ్ తయారీ
- సివిల్ డ్రెస్‌లో స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు
అధికారుల పర్యేవేక్షణ లేకపోవడంతో పిల్లల స్కూల్ యూనిఫామ్ కోసం మహిళా సంఘాలకు సప్లై చేసిన క్లాత్ వృథా అయ్యింది. సరైన కొలతలతో స్టిచింగ్ చేయకపోవంతో స్టూడెంట్స్ ధరించలేని విధంగా ఉండటంతో పిల్లలు ధరించేందుకు ఇష్టపడటం లేదు. మొదటి జత యూనిఫామ్ లాగే రెండో జత కూడా ఉండటంతో రీస్టిచింగ్ కోసం పేరెంట్స్ టైలర్లకు ఇస్తున్నారు. కొన్ని చోట్ల టీచర్లు చందాలు వేసుకొని యూనిఫామ్ రెడీ చేస్తున్నారు.
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని సర్కారు బడి పిల్లల కోసం పంపిన రెండో జత యూనిఫామ్ కూడా లోపభూయిష్టంగా స్కూళ్లకు చేరాయి. సరైన కొలతలతో స్టిచ్చింగ్ చేయకపోవంతో స్టూడెంట్స్వీటిని ధరించే వీలులేకుండా ఉంది. ఇష్టారీతి కొలతలతో స్టిచ్చింగ్ చేసిన నిక్కర్లు , ప్యాంట్, అంగీలు సరఫరా చేశారు. మొదటి జత యూనిఫారాలు స్టిచ్చింగ్ చేసిన విధంగానే రెండవ జత యూనిఫారాలు పంపించారు.
సరైన కొలతలు లేకుండా..
జిల్లాలో 693 ప్రైమరీ స్కూల్స్, 116 అప్పర్ ప్రైమరీ, 230 హైస్కూల్స్, 25 కేజీబీవీలు, 10 ఆదర్శ పాఠశాలలు కలిపి మొత్తం 1,074 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 60,355 బాయ్స్, 51,906 గర్ల్ స్టూడెంట్స్ ఉన్నారు. 1 నుంచి 12 తరగతి చదివే పిల్లలకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాలని సంకల్పించిన గవర్నమెంట్4.89 లక్షల మీటర్ల క్లాత్ పంపింది. స్టిచ్చింగ్ కోసం మహిళా సంఘాలకు ఇచ్చారు. సరైన కొలతలతో యూనిఫారాలు కుట్టకపోవడంతో మొదటి జత పాడయ్యాయి. రెండో జత విషయంలోనూ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మొదటి జత లాగే పది రోజుల కింద స్కూల్స్‌కు చేరాయి.
1 నుంచి 3 క్లాస్ పిల్లలకు పంపిణీ చేసిన నిక్కర్లు కొన్ని పొట్టిగా, కొన్ని పొడవుగా, అంగీలు బిర్రు ఉన్నాయి. 4 నుంచి 7 క్లాస్ పిల్లలకు రెండు సైజుల్లో మళ్లీ పంపారు. 8 నుంచి 10 స్టూడెంట్స్కోసం పంపిన ప్యాంట్, షర్ట్లు వంకరటింకర సైజుల్లో ఉన్నాయి. 1-3 మంది అమ్మాయిల కోసం రెడీ చేసిన ఫ్రాకులు, 4,5 క్లాస్ బాలికలకు స్కర్ట్స్, 6 నుంచి 12 తరగతి గర్ల్స్‌కు చుడీదార్లు కూడా ధరించ వీలులేని రీతిలో పంపగా వాటినే స్టూడెంట్స్‌కు పంపిణీ చేశారు.
సరైన కొలతలు లేనందున మొదటి జత మాదిరే వచ్చిన రెండవ జతను వేసుకోడానికి స్టూడెంట్స్ ఇష్టపడటంలేదు. బాలికల ఓణి క్లాత్ 864 మీటర్లు మినహా షర్ట్, ప్యాంట్, స్కర్ట్స్కోసం గవర్నమెంట్ పంపిన క్లాత్ వేస్ట్అయింది. పైగా కట్టింగ్ లోపాలతో 6 వేల మీటర్ల క్లాత్ షార్టేజ్ ఏర్పడింది. దాని కోసం ఇన్డెంట్ పంపారు.
ఈ యాడాదికి ఇంతే
ఒక విద్యా సంవత్సరంలో రెండు జతల యూనిఫామ్ మాత్రమే స్టూడెంట్స్‌కు ఇస్తారు. ఇచ్చిన రెండు జతలూ ధరించడానికి వీలులేకుండా ఉండడంతో పిల్లలు సివిల్ డ్రెస్‌లోనే బడులకు వస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల టీచర్లు చందాలు వేసుకొని పిల్లలకు జత యూనిఫామ్ రెడీ చేస్తున్నారు. నవీపేట మండలం బినోల హైస్కూల్ టీచర్లు రూ.60 వేలు చందాలు వేసుకొని 200 మంది స్టూడెంట్స్‌కు యూనిఫామ్, టై, బెల్ట్, షూ, సాక్స్ అందజేశారు. మహిళా సంఘాల నుంచి సప్లై అయిన వాటిలో లూజ్ డ్రెస్‌లను పిల్లలకు అనువైన సైజ్ చేయించడానికి కొంతమంది పేరెంట్స్ టైలర్లకు ఇచ్చారు.