నితీష్ కింగ్ మేకర్ అయితే..బీహార్కు ప్రత్యేక హోదా తేవాలి

నితీష్ కింగ్ మేకర్ అయితే..బీహార్కు ప్రత్యేక హోదా తేవాలి

కేంద్రంలో మిత్రపక్షాల మద్ధతు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. NDAలో నితీష్ కుమార్ నిజంగా కింగ్ మేకర్ అయితే... బిహార్ కు స్పెషల్ స్టేటస్ తేవాలన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టేలా మోదీపై ఒత్తిడి చేయాలని చెప్పారు. బిహార్ ప్రజల రుణం తీర్చుకునేందుకు నితీష్ కు ఇదే సరైన సమయమన్నారు తేజస్వీ యాదవ్. 

లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమిలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్  కీ రోల్ అయ్యారు.  ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఇవాళ ఎన్డీయే కూటమి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నితీశ్ వెంట ఢిల్లీకి ఆర్జేడీ నేత అపోజిషన్ లీడర్ తేజస్వీ యాదవ్ కూడా ఉండడం గమనార్హం. బీహార్ లో  ఆర్జేడీకి నాలుగు ఎంపీ సీట్లు రాగా..జేడీయూకి 12 ఎంపీ సీట్లు వచ్చాయి.