మార్చి 6 నుంచి టెన్త్ ప్రీఫైనల్

మార్చి 6 నుంచి టెన్త్ ప్రీఫైనల్

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 6  నుంచి 15 వరకు జరగనున్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్​ను డీఈఓలకు ఆయన పంపించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. మార్చి 6న ఫస్ట్ లాంగ్వేజీ, 7న సెకండ్ లాంగ్వేజీ, 10న థర్డ్ లాంగ్వేజీ, 11న మ్యాథ్స్, 12న ఫిజికల్ సైన్స్, 13న బయాలజికల్ సైన్స్, 15న సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొన్నారు. మార్చి 21 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వివరించారు.  

27 నుంచి ఓపెన్ టెన్త్,ఇంటర్ తత్కాల్ ఫీజు గడువు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో జరిగే ఎస్ఎస్​సీ, ఇంటర్ పరీక్షలకు అటెండ్ అయ్యే అభ్యర్థులు తత్కాల్ ద్వారా ఈ నెల 27 నుంచి 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించినట్టు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు http://www.telanganaopen school.org వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.