తాగునీటి కోసం జిల్లాకు రూ.కోటి రిలీజ్

తాగునీటి కోసం జిల్లాకు రూ.కోటి రిలీజ్
  • పీఆర్‌‌ ఆర్డీ నుంచి కలెక్టర్లకు ప్రత్యేక నిధులు 

హైదరాబాద్, వెలుగు: వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సొంత నిధుల నుంచి రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టర్లకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయిం చింది. ఈ మేరకు మంగళవారం పీఆర్, ఆర్డీ అధికారులు ఫండ్స్ రిలీజ్‌ చేశారు. అయితే, గ‌తంలో ఫైనాన్స్ శాఖ నుంచి ప్రత్యేక నిధుల కోసం అనుమ‌తులు ఇచ్చేవారు. కానీ, ఒక్క ఏడాదికూడా నిధులు విడుద‌ల చేసిన దాఖ‌లా లు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అత్యవ‌స‌ర తాగునీటి అవ‌స‌రాల కోసం పీఆర్, ఆర్డీ సొంత నిధులు కేటాయించింది.

 సమ స్యలు తలెత్తి భ‌గీర‌థ నీరు రాక‌పోయినా, పైప్‌లైన్, మోటార్ల మెయింటెనెన్స్ తదితర అవసరాలకు ఈ నిధి నుంచి ఖర్చు చేయవచ్చు. అవసరమైన చోట కొత్తగా బోర్లు వేయడానికి, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందించేందుకు కూడా ఈ నిధులను వినియోగించవచ్చు. కాగా, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామాలు, మండ‌ల కేంద్రాల్లోనూ చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.