నేడు ఆటోడ్రైవర్ల చలో అసెంబ్లీ

నేడు ఆటోడ్రైవర్ల చలో అసెంబ్లీ

బషీర్ బాగ్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం వేల మంది ఆటో కార్మికులతో అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ గురువారం వెల్లడించింది. ఆటో డ్రైవర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని జేఏసీ కన్వీనర్ వెంకటేశం తెలిపారు. 

రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరు నెలలుగా చర్చల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి లాటీలు, తూటాలు తగిలినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హిమాయత్ నగర్ లోని సత్యనారాయణరెడ్డి భవన్ నుంచి భారీ ప్రదర్శనగా వెళ్లి అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఓలా, రాపిడో బైక్ టాక్సీ, మహాలక్ష్మి పథకాలతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు.