హైదరాబాద్, వెలుగు: తిరుమల లడ్డూ వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందని- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటో, జరిగింది ఏమిటో చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం వాస్తవాలను వెంటనే బయటపెట్టి కల్తీలేని లడ్డూలను భక్తులకు అందించాలని, అలాంటి దోషాలు తిరిగి జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు.. జగన్ పేరు ప్రస్తావించడంతో కొ న్ని అనుమానాలు వస్తున్నాయన్నారు.
బీజేపీ చంద్రబాబుతో మతపరమైన రాజకీయా లకు తెరతీస్తోందన్న అనుమానం కలు గుతున్నదన్నారు. మతపరమైన అంశాల చుట్టూనే బీజేపీ అజెండా ఉంటుందని విమర్శించారు.