
సూర్యాపేట, వెలుగు : చిత్రలేఖనంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి పి. శ్రీవాణి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో కార్టూనిస్ట్ ఆనంద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బుద్ధుని జీవిత చరిత్ర, సమ్మక్క –సారక్క, జాతీయ నాయకులు, జాతీయ పక్షి చిత్రాలు ఎంతో బాగున్నాయన్నారు.
అనంతరం ఆనంద్ తను వేసిన జడ్జి శ్రీవాణి చిత్రలేఖన పటాన్ని ఆమెకి అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి లింగయ్య, సీనియర్ న్యాయవాదులు శశిధర్, సుంకర బోయిన రాజు, ప్రముఖ కవి బెల్లంకొండ శ్రీరాములు, గ్రీన్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేందర్, ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.