తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు రాజస్థాన్ లో భారీ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. నిందితులను నుంచి భారీగా చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తెలంగాణలో 200లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడింది రాజస్థాన్ ముఠా. దీంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు సైబర్ నేరస్తులను పట్టుకునేందుకు రాజస్థాన్ వెళ్లారు. జయ్ పూర్, నాగ్ పూర్,జోధ్ పూర్ లో సోదాలు చేశారు. రాజస్థాన్ నేరగాళ్లు అన్ని రకాల నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.
15 రోజుల అపరేషన్ లో భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేశామని హైదరాబాద్ క్రైం అడిషనల్ సీపీ శిఖాగోయల్ తెలిపారు. నిందితులు అందరూ విద్యావంతులు. మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారు . ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారు . 27 మంది తెలంగాణ వ్యాప్తంగా 189 కేసుల్లో నిందితులుగా ఉన్నారు . దేశ వ్యాప్తంగా 2023 కేసులో వీళ్లు నిందితులు.వీరి వద్ద నుండి 31 మొబైల్ ఫోన్స్ 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్ లను స్వాధీనం చేసుకున్నామని శిఖాగోయల్ మీడియాకు వెల్లడించారు.
నిందితులు 29 మ్యూల్ అకౌంట్ లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారు . 11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా చేశారు. విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉంది . సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీం లను ఏర్పాటు చేసాము. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు అందర్నీ పట్టుకోగలిగం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్ పాచ్ అయ్యి నిందితులను అరెస్ట్ చేశారు. మా బృందాలు ఎప్పటికపుడు నేరస్తుల కదలికలు, లోకేషన్ లపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారని శిఖాగోయల్ తెలిపారు.
కాంబోడియా, వియత్నాం,మయన్మార్ నుంచి కూడా నేరాలకు పాల్పడుతున్నారని శిఖాగోయల్ తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామన్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు శిఖాగోయల్.