చెరువులపై హైడ్రాకు టీడీఎఫ్ రిపోర్ట్

చెరువులపై హైడ్రాకు టీడీఎఫ్ రిపోర్ట్
  • నివేదికపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తామన్న హైడ్రా కమిషనర్

పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) చెరువులపై హైడ్రాకు రిపోర్ట్ ను అందజేసింది. హైడ్రా కమిషన్ ఎవి. రంగనాథ్ కు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి పలు సూచనలతో కూడిన రిపోర్టును సమర్పించారు. డాక్టర్​బిక్షం గుజ్జ, డా.కె.శివకుమార్, శ్రవణ్​కుమార్​సహకారంతో రిపోర్ట్ ను అందజేశారు. దీనిని తెలంగాణ సమాజానికి పుస్తక రూపంలో అందించనున్నట్టు టీడీఎఫ్​అమెరికా మాజీ  ప్రెసిడెంట్ గాదె గోపాల్ రెడ్డి తెలిపారు. 

రాష్ట్రంలోని 46,500 నీటి వనరుల గురించి ఈ రిపోర్ట్​లో వివరంగా పొందుపరిచామని చెప్పారు. హైదరాబాద్ తో సహా 4 జిల్లాలకు సంబంధించి 1042 చెరువుల డీటెయిల్డ్​రిపోర్ట్ ను​కమిషనర్​కు సమర్పించామని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్​రంగనాథ్​మాట్లాడుతూ.. రిపోర్ట్​పై వచ్చే వారం రిటైర్డ్​ఇంజినీర్లు, టీడీఎఫ్ సభ్యులతో కలిసి సమావేశం​ నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్​ఇండియా మాజీ చైర్మన్​ బద్దం రణధీర్​ పాల్గొన్నారు.