ఈ నెల 25న ఎలక్ట్రికల్ మహాసభలు

ఈ నెల 25న ఎలక్ట్రికల్ మహాసభలు

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రికల్ మహాసభలు ఈ నెల 25న నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రకటించింది. బుధవారం మింట్​కాంపౌండ్​లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర​అధ్యక్షుడు బీసీ. రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​గౌడ్, ఎలక్ట్రికల్ లైసెన్సింగ్​బోర్డు సభ్యుడు నేమాల బెనర్జీ, లైసెన్సింగ్​ బోర్డు మాజీసభ్యుడు నక్కయాదగిరి మాట్లాడారు. ఎలక్ట్రికల్​ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

 ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. లక్డీకాపూల్​రెడ్​ హిల్స్​లోని ఫ్యాప్సీ భవన్​లో జరిగే ఈ కార్యక్రమానికి టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు కె. కెశవరావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, విద్యుత్తు శాఖ ప్రధాన తనిఖీ అధికారి సీహెచ్. రామాంజనేయులు, మాస్టర్ ప్లాన్ సీజీఎం చక్రపాణి, ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు కార్యదర్శి టి.కాంతారావు పాల్గొంటారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సంఘం స్టేట్ అడ్వైజర్​రాజు మహారాజ్, ఎ.మహేందర్, నామినీ వెంకటేశ్ నేత తదితరులు పాల్గొన్నారు.