ఆర్టిజన్స్​ను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

ఆర్టిజన్స్​ను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి
  • తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు: విద్యుత్తు శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ చైర్మన్ ఈశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో 20 వేల మంది వరకు పనిచేస్తున్న ఆర్టిజన్స్ లను జేఎల్ఎమ్ , సబ్ ఇంజనీర్ , జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినినేట్స్ గా  కన్వర్షన్ ఇవ్వాలని కోరారు. ఇదే డిమాండ్ తో ఈ నెల 20న చేపట్టిన ఛలో విద్యుత్ సౌదాను ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి  అరెస్టులు చేశారని విమర్శించారు. 

ఆర్టిజన్స్ లను కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే వ్యవహరించడం సరికాదన్నారు. ఛలో విద్యుత్ సౌధలో పాల్గొన్న ఉద్యోగులను  విధుల్లోకి తీసుకోడం లేదని.. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే 20 వేల మంది ఆర్టిజన్స్ విధులు బహిష్కరించి రోడ్డెక్కుతారని జేఏసీ చైర్మన్ ఈశ్వర్ రావు హెచ్చరించారు.