సీఎం సహాయ నిధికి ఒకరోజు వేతనం .. రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పవర్ యుటిలిటీస్ లోని ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు  అందరూ తమ ఒక రోజు వేతనం(బేసిక్ సాలరీ) ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నెలలో ఒకరోజు మూల వేతనం మొత్తం రూ.15కోట్లు సీఎం సహాయ నిధికి విరాళంగా అందించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను గురువారం  జేఏసీ నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జీ సాయి బాబు, కన్వీనర్ రత్నాకర్ రావు,  కో కన్వీనర్  బీసీ రెడ్డి, తులసి దాస్ తదితరులు పాల్గొన్నారు.