కృష్ణా బోర్డుకు తెలంగాణ చీఫ్ ఇంజనీర్ లేఖ 

  • అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా నీటిని తరలించుకుంటోందని అభ్యంతరం
  • అక్రమంగా నీటి తరలింపును వెంటనే ఆపాలని వినతి
     

హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ప్రభుత్వం తరపున తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా తుంగభద్ర, కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణా నదిపై నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మల్యాల పంపింగ్ స్టేషన్, పోతిరెడ్డిపాడు నుంచి బానకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా నీటి తరలింపు జరుగుతోందని.. ఈ నీటి తరలింపు ఆపాలని కోరింది. 
 కెఆర్ఎంబీ (KRMB)  ఛైర్మన్ కు రాసిన  లేఖలోని ముఖ్యాంశాలు

  • శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలి. 
  • బానకచర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కె సి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలి. 
  •   నీటి కేటాయింపులు  లేని హంద్రీ-నీవా ( HNSS) ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతలను వెంటనే ఆపివేయాలి. 
  • సుంకేశుల బ్యారేజి ద్వారా కర్నూలు - కడప కాలువకు 39.90 టీఎంసీల నీటి  కేటాయింపులు ఉండాగా ప్రతీ ఏటా సరాసరి 54 టీఎంసీల తుంగభద్ర జలాలు తరలిస్తునారు. ఆర్డీఎస్ కు 15.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా సరాసరి 5 టీఎంసీలకు మించి తరలించడం సాధ్యం కావడం లేదు. 
  •  తుంగభద్ర జలాలకు అదనంగా కె సి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమం. 
  • ఆంధ్రప్రదే రాష్ట్రం  కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 టీఎంసీలు మాత్రమే తరలించాలి. కానీ ఈ తరహా కేటాయింపులు లేని అక్రమ ఎత్తిపోతల పథకాల ద్వారా తన పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నది. కావున ట్రిబ్యునల్ ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిఫ్ట్ ల ద్వారా నీటి తరలింపు మరియు కేటాయింపులను KRMB నిరోధించాలి.
  •