రూ.972 కోట్లతో 12 జిల్లాల్లో కోర్టుల నిర్మాణం

రూ.972 కోట్లతో 12 జిల్లాల్లో కోర్టుల నిర్మాణం
  • అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం రూ.972 కోట్లతో 12 జిల్లాల్లో కోర్టుల నిర్మాణం  చేపట్టనుంది. ఈ మేరకు లా సెక్రటరీ తిరుపతి అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా కోర్టులు నిర్మించే జిల్లాల్లో సంగారెడ్డి, మహాబూబ్ నగర్, కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, భువనగిరి, వనపర్తి, అదిలాబాద్, నిర్మల్, సిరిసిల్ల ఉన్నాయి. వీటితో పాటు నవ్య నిర్మాణ ప్లాన్ లో భాగంగా ఫ్యామిలీ కోర్డ్, పోక్సో కోర్టు కూడా నిర్మించనున్నారు. త్వరలో ఆర్ అండ్ బీ అధికారులు వీటి నిర్మాణాలకు డిజైన్లు ఖరారు చేయనున్నారు.