
- రేపటి నిత్య కల్యాణ వేడుకలు నిలిపివేత
భద్రాచలంలో రాములోరి తెప్పోత్సవం కన్నులపండుగలా జరిగింది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయ పూజారులు తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. గోదావరిలో హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు.
సోమవారం సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులను అనుగ్రహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో రేపటి నిత్య కల్యాణ వేడుకలను అధికారులు నిలిపివేశారు.