ఉన్నత విద్యలో దివ్యాంగులకు5 శాతం రిజర్వేషన్లు

ఉన్నత విద్యలో దివ్యాంగులకు5 శాతం రిజర్వేషన్లు
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యా శాఖ

హైదరాబాద్, వెలుగు: ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా జీవో జారీ చేశారు. ప్రభుత్వం సూచించిన రూల్స్  మేరకు 40 శాతం కంటే ఎక్కువ  వైకల్యం ఉన్న వారికి 5 ఏండ్ల ఏజ్ రిలాక్సేషన్, 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టింది. 

అంధత్వం, బధిరులు, మరుగుజ్జులు, యాసిడ్ బాధితులు, కండరాలు సరిగా పనిచేయని వాళ్లు, ఆటిజం, మానసిక వైకల్యం, చెవుడు తదితర వైకల్యం ఉన్న వారిని ఐదు కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీకి ఒక శాతం రిజర్వేషన్​ను అమలు చేయనుంది. వికలాంగుల కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లను మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లతో భర్తీ చేస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.