![317 మ్యూచువల్ బదిలీలు 20లోగా పూర్తి చేయాలి](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-government-orders-completion-of-mutual-transfer-process-by-month-end_FkS3VNwMx1.jpg)
- అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తెచ్చిన జీవో 317తో ఇబ్బంది పడుతున్న వారి మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఆయా శాఖలకు నోట్ జారీ చేసింది.
జీవో 317తోపాటు, స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ గ్రౌండ్స్‌లో ఉద్యోగులు చేసుకున్న బదిలీ దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోగా క్లియర్ చేసి, వారినీ కోరుకున్న జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఈ నెల 28వ తేదీలోగా అందజేయాలని ఆయా శాఖల స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలను సర్కారు ఆదేశించింది.