పల్లె ప్రగతి రోడ్లకు మరో రూ.2,773 కోట్లు

పల్లె ప్రగతి రోడ్లకు మరో రూ.2,773 కోట్లు
  • సీఆర్ఆర్ రోడ్ల కోసం రూ.1,419 కోట్లు
  • ఎంఆర్ఆర్  రోడ్లకు రూ. 1,288 కోట్లు
  • గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంలో రూ.2,682.95 కోట్లు మంజూరు
  • సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రి సీతక్క ధన్యవాదాలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పల్లె ప్రగతి రోడ్లకు ప్రభుత్వం గురువారం మరో రూ.2,773 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.2,682.95 కోట్లతో గ్రామాల్లో రహదారుల పనులు కొనసాగుతుండగా.. తాజాగా మంత్రి సీతక్క చొరవతో మరో  రూ.2,773 కోట్లు పల్లెదారులకు మంజూరు చేసింది. ఈ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు బీటీ రోడ్లు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, తండాలు, గూడేల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. 

సీఆర్ఆర్  రోడ్ల కోసం రూ.1,419 కోట్లు, ఎంఆర్ఆర్  రోడ్ల కోసం  రూ.1,288 కోట్లు, పీఎం జన్ మన్  రాష్ట్ర వాటా కింద రూ.66 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జన్ మన్  నిధులతో 25 ఆదివాసీ గూడేలకు బీటీ రోడ్లు వేయనున్నారు. కాగా.. గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్థిక మంత్రి భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టి విక్రమార్కను మంత్రి సీతక్క గురువారం కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే, వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర మంత్రుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి సీఎం రేవంత్  పెద్దపీట వేస్తున్నారని సీతక్క​అన్నారు. గ్రామీణాభివృద్దికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్నడూలేని విధంగా నిధులు మంజూరు చేసి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్  యోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న కింద రూ.197 కోట్లు, పీఎంజీఎస్ వై కోసం రూ. 110 కోట్లు విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చేశామని చెప్పారు. రాబోయే కాలంలో మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. 

237 మంది ఇంజినీరింగ్ అధికారులకు 5 కోట్లు

ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యవేక్షణ కోసం ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్ఈల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం వాహన సౌకర్యం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 237 మంది ఇంజినీరింగ్ అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.5 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా, ఒక్కో వాహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం అద్దె చెల్లింపు కోసం నెల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.33 వేలు మంజూరు చేసింది. గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త బీఆర్ఎస్  ప్రభుత్వంలో అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెహికల్  అల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెన్స్ ఇవ్వకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగే ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యవేక్షణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లేందుకు ఇంజినీర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను గుర్తించి వాహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దుపాయం క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్పించిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు పంచాయతీ రాజ్ ఈఎన్సీ కనకరత్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.