బీసీ వెల్ఫేర్ ఆధీనంలోకి నీరా కేఫ్

బీసీ వెల్ఫేర్ ఆధీనంలోకి నీరా కేఫ్
  • టూరిజం నుంచి బదిలీ
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: టూరిజం కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న నీరా కేఫ్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లోని  కల్లు గీత కార్పొరేషన్ కు  బదిలీ అయింది. ఈ మేరకు సోమవారం బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి నుంచి కేఫ్ ను బీసీ కార్పొరేషనే నిర్వహించనుంది. 

కేఫ్ నుంచి వచ్చే రెవెన్యూలో 30 శాతం టూరిజం కార్పొరేషన్ కు, 70 శాతం కల్లు గీత కార్పొరేషన్ కు వెళ్తుందని ఉత్తర్వుల్లో సెక్రటరీ పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ లోని టూరిజం కార్పొరేషన్ ప్లేస్ లో నీరా కేఫ్ ఏర్పాటు చేశారు. అందుకయ్యే  ఖర్చు రూ.12.5 కోట్లను టాడీ కార్పొరేషన్ బడ్జెట్ నుంచి వెచ్చించారు. త్వరలోనే నీరా కేఫ్​ ను టాడీ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ శాఖ ఉద్యోగులకు బాధ్యతలు అప్పజెప్పనున్నారు.